Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు కేక్‌ను ఎలా తయారు చేస్తారు.. వాడే పదార్థాలేంటి?

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (10:37 IST)
ఆరోగ్యానికి పెరుగు ఎంతో మంచిది. అలాంటి పెరుగుతో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇపుడు పెరుగుతో కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
పెరుగు కేక్ తయారీకి కావలసిన పదార్థాలు:
మైదా పిండి: 2 కప్పులు
పంచదార పొడి: 2 కప్పులు
వెనిలా ఎసెన్స్: 1 స్పూన్‌
పాలు : అరకప్పు
వెన్న: అరకప్పు
బేకింగ్ సోడా: చిటికెడు
నూనె: 5 స్పూన్‌లు
ఎండు ద్రాక్షలు : తగినంత
జీడిపప్పు: తగినంత 
క్రీమ్ కోసం పాలు: 5 స్పూన్‌లు 
స్ట్రాబెర్రి : అలంకరణ కోసం
 
 
కేక్ తయారీ: నూనె లేకుండా మైదా పిండిని సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో బేకింగ్ సోడా, కొంచెం పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 10 నిముషాల తర్వాత వెనిలా ఎసేన్స్ చేర్చాలి. ఈ మిశ్రమంలో వేయించుకున్న మైదాపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. క్రీమ్‌లా తయారైన ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి కేక్ మౌల్డ్‌లో వేసుకుని ఓవెన్‌లో బేక్ చేయాలి. అరగంటయ్యాక తీయాలి. 
 
క్రీమ్ తయారి : వెన్నలో పంచదార, పాలు, వెనిలా ఎసెన్స్ చేర్చి బీటర్‌తో బీట్ చేయాలి. క్రీమ్ గట్టిగా అయితే కొంచెం పాలు చేర్చాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌ను కేక్ మీద పరిచి స్ట్రాబెర్రి‌తో అలంకరించుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు కేక్ ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అంతే ఎంతో టేస్టీ టేస్టీ పెరుగు కేక్ రెడీ. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments