Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థూలకాయన్ని తగ్గించే "పపయాసాస్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీ
పంచదార.. పావు కేజీ
సోడియం బెన్‌టోజ్.. ఒక టీ.
సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.
గరంమసాలా.. 5 గ్రా.
లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత

తయారీ విధానం :
ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి కలియబెట్టాలి.

ఈ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత దించి తగినంత ఉప్పు, సోడియం బెన్‌టోజ్, సిట్రిక్ యాసిడ్, మిగిలిన పంచదారనును వేసి బాగా కలియబెట్టి, మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే పపయా సాస్ రెడీ. వారం రోజులదాకా నిల్వ ఉండే ఈసాస్‌ను బ్రెడ్‌తో కలిపి తినవచ్చు.

ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శభోజనం తీసుకునే వారికీ, ఇది మంచి ఆహారం. ప్రతీరోజూ ఓ బొప్పాయి పండు తీంటే స్థూలకాయం బాగా తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది కూడా.!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments