Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టఫ్డ్ టమోటా ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
తయారీకి కావాల్సిన పదార్థాలు
తగిన సైజుల్లో ఉండే టమోటాలు 5
ఉల్లిపాయలు : ఒకటి (సన్నగా తురిమి పెట్టుకోవాలి)
పన్నీరు తురుము - 100 గ్రాములు
పచ్చిమిరప కాయలు - రెండు
కొత్తిమీర - సన్నగా తరిగి ఉంచుకోవాలి
ఉప్పు, కారం, గరం మసాలా - తగినంత
పసుపు - చిటికెడు
చీజ్‌ తురుము - ఓ టేబుల్‌ స్పూన్‌
నూనె - వేపుడుకు సరిపడినంతగా

ఎలా తయారు చేస్తారు
ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తర్వాత టమోటా తొడిమ దగ్గర గుండ్రంగా కత్తిరించాలి. తర్వాత మధ్యలో ఉన్న పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. దీనిని ఒక పక్కన పెట్టి పైన తీసేసిన భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగేంత వరకు ఉంచాలి.

ఇప్పుడు టమోటోలో తీసిన గుజ్జును, టమోటా ముక్కలను వేసి ఒక నిమిషం వేయించి అందులో మసాలాలు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో పన్నీర్‌ వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత దానిని పక్కకి తీసి ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపాలి.

దానిపై తురిమి పెట్టుకున్న చీజ్‌, కొత్తిమీరను వేయాలి. తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌ ప్లేట్‌లో పెట్టి దానిపై వెన్న వేసి ఒక విజిల్‌ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. దీనిని వేడి వేడిగా సర్వ్‌ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

Show comments