Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండితో కాకరకాయ చిప్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు కాకరకాయలు... పావుకేజీ
సెనగపిండి... 50గ్రా.
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక టీస్పూను
కరివేపాకు... రెండు రెమ్మలు
పచ్చిమిర్చి... నాలుగు
ఆమ్‌చూర్... అరటీ.
కారం... అరటీ.
రెడ్‌ ఆరెంజ్‌ కలర్... చిటికెడు
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా కాకరకాయలను గుండ్రని చిప్స్‌లాగ కోసి ఉంచాలి. తరవాత వీటిని మరుగుతున్న నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించి నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో శెనగపిండి, అల్లంవెల్లుల్లి, కరివేపాకు, ఆమ్‌చూర్‌, కారం, రెడ్‌ ఆరెంజ్‌ కలర్‌, ఉప్పు తీసుకుని.. తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.

చివర్లో ఉడికించి ఉంచిన కాకరకాయ ముక్కలను ఈ పిండిలో వేసి కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి సరిపడా నూనె పోసి కాగిన తరువాత పిండిలో కలిపిన కాకరకాయ ముక్కల్ని వేసి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే శెనగపిండితో కాకరకాయ చిప్స్ తయారైనట్లే..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments