Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ ఊరగాయ "బెంగాలీ ఆమ్‌-తాల్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడికాయలు... ఒక కేజీ
ఉప్పు... వంద గ్రా.
ఆవాలు పొడి... 25 గ్రా.
వెల్లుల్లిముద్ద... 25 గ్రా.
అనాస, మెంతి, జీలకర్ర కలిపి నూరిన మసాలా... 50 గ్రా.
వేయించి పొడి చేసిన ఎండుమిర్చి... 50 గ్రా.
ఆవనూనె... అర కేజీ

తయారీ విధానం :
పచ్చి మామిడికాయల తొక్కు తీసి రెండు మూడు సెంటీమీటర్ల పొడవు, వెడల్పులతో ముక్కలు కోయాలి. ఈ ముక్కలను ఎండలో ఎండనివ్వాలి. కాస్త ఎండాక ఉప్పు కలిపి మళ్లీ ఎండలో పెట్టి రోజంతా ఎండనివ్వాలి. వాటిని ఓ రాత్రంతా అలా వదిలేసి ఉంచాలి. దాంతో ముక్కల నుంచి నీరు ఊరుతుంది. ఆ తరువాత వాటినలాగే 8-10 రోజులపాటు ఎండలో ఎండనివ్వాలి.

ఉప్పు, కారం, ఆవాల పొడి, వెల్లుల్లిముద్ద, అనాస మసాలా అన్నింటినీ ఒక పాత్రలో వేసి కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఎండిన ముక్కల్లో కలిపి చివరగా నూనె కలిపి జాడీలోకి పెట్టాలి. ఈ జాడీని 15-20 రోజులపాటు ఎండలో ఉంచి తీయాలి. అంతే బెంగాలీ ఆమ్‌-తాల్‌ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

Show comments