Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటును అదుపులో పెట్టే.. "అరటి మామిడి ఇగురు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అరటికాయలు... మూడు
పచ్చిమామిడి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.
పోపు దినుసులు... అర టీ.
మిర్చి పొడి... రెండు టీ.
ధనియాల పొడి... అర టీ.
గరంమసాలా... పావు టీ.
పచ్చిమిర్చి తరుగు... పది
పసుపు... అర టీ.
కొత్తిమీర... 2 కట్టలు
కరివేపాకు... 2 రెమ్మలు
రిఫైండ్ ఆయిల్... సరిపడా

తయారీ విధానం :
ముందుగా అరటికాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి, పైతోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి, వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి ఆ తరువాత... ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, ధనియాల పొడి, మామిడి ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి.

నీళ్ళు చిక్కబడ్డాక గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వరసగా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది వేడి వేడి అన్నంతో తింటే బాగుంటుంది. అరటిలో ఎక్కువగా లభించే పొటాషియంవల్ల... రక్తపోటు, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని, అల్సర్లను నివారిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

Show comments