Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడికాయ పొడితో "పంజాబీ చెన్నా మసాలా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
తెల్ల శెనగలు.. 6 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు.. 4 కప్పులు
టొమోటోలు.. 8
వెల్లుల్లి.. 30 రేకలు
పచ్చిమిర్చి.. 6 (పొడవుగా సన్నగా తరగినవి)
అల్లం.. 2 టీ. (సన్నగా కత్తిరించినది)
నెయ్యి.. 8 టీస్పూన్లు.
ధనియాలపొడి.. 2 టీ.
కారం... 2 టీ.
ఎండబెట్టిన మామిడిపొడి.. 2 టీ.

తయారీ విధానం :
ముందురోజు రాత్రి శెనగల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటిరోజున వాటిని ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిలను పేస్ట్ చేసుకోవాలి. టొమోటోలను వేడినీటిలో ఉడికించి తోలుతీసి గుజ్జు చేసి ఉంచాలి. బాణలిలో నెయ్యిపోసి కాగిన తరువాత రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్దను వేసి వేయించాలి. నెయ్యి పైకి తేలిన తరువాత టొమోటో గుజ్జు వేసి కాసేపు కలియబెట్టి.. అల్లం, ఉడికించి ఉంచిన శెనగలు వేసి, తగినన్ని నీరు పోసి సన్నటి సెగమీద ఉడికించాలి.

తరువాత దీనికి కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, మామిడికాయ పొడి, పచ్చిమిర్చి కూడా కలిపి ఉడికించాలి. చివరగా, కూర చిక్కబడిన తరువాత కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పంజాబీ చెన్నా మసాలా కర్రీ తయార్. ఈ కూరను ఉల్లిముక్కలమీద నిమ్మరసం, మిరియాలపొడి చల్లి పూరీలలోకి, చపాతీలలోకి వేడి వేడిగా సర్వ్ చేస్తే అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం .. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది (Video)

రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటా : యనమల రామకృష్ణుడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో నారా లోకేష్ దంపతులు (video)

రైతు చేయిని కొరికిన చేప... అరచేతిని తొలగించిన వైద్యులు!!

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Show comments