Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాల సువాసనతో "బేసన్‌ బాల్స్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
శెనగపిండి... 150 గ్రా.
నువ్వులు... 50 గ్రా.
నూనె... వంద గ్రా.
నీరు... ఒకటిన్నర గ్లాసు
ఉప్పు.. తగినంత
కొత్తిమీర తురుము.. కాస్తంత
ఉల్లిముద్ద... పావు కప్పు
టొమోటో గుజ్జు... అర కప్పు
కొబ్బరి గసాల ముద్ద.. రెండు టీ.
కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి... తలా ఒక టీ.
కారం, ధనియాల పొడి.. చెరో టీ.
పసుపు, గరంమసాలా... చెరో పావు టీ.

తయారీ విధానం :
శెనగపిండిలో నువ్వులపొడి, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, కారం, నూనె, కొంచెం నీళ్లు అన్నీ కలిపి గట్టిముద్దలా కలపాలి. ముద్దలోంచి కొద్దికొద్దిగా తీసుకుని గోళీకాయల సైజులో ఉండలు చేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి.

టొమాటో గుజ్జు, కొబ్బరి-గసాల ముద్ద వేసి కలియబెట్టి, ఎసరునీళ్లు పోసి మూత ఉంచాలి. నీళ్లు సగం ఇగిరాక శెనగపిండి ఉండలు వేసి ఉడికించాలి. నూనె పైకి తేలేదాకా ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి. మసాలా సువాసనతో కమ్మగా ఉండే ఈ బేసన్‌ బాల్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తినాలి. అన్నం, చపాతీల్లోకీ కూడా ఇవి చాలా బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments