Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీకార్న్ మంచూరియా

Webdunia
బుధవారం, 23 జులై 2008 (18:10 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బేబీకార్న్ (లేత మొక్కజొన్నలు) ... ఆరు
వరిపిండి... ఒక టీస్పూన్
మొక్కజొన్నపిండి... రెండు టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిరపకాయలు... రెండు
కారం... అర టీస్పూన్
టొమోటో సాస్... రెండు టీస్పూన్లు
సోయా సాస్... ఒక టీస్పూన్
కొత్తిమీర... కొద్దిగా
నూనె... సరిపడా
ఉప్పు... సరిపడా
కొత్తిమీర... సరిపడా

తయారీ విధానం :
కాసిన్ని నీళ్లలో బేబీకార్న్స్, ఉప్పు కలిపి కాసేపు ఉడికించాలి. తరువాత నీటిని ఒంపేసి వాటిని ఆరబెట్టాలి. వరిపిండి, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఓ టీస్పూన్ టొమోటో సాస్, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేబీకార్న్స్‌కు బాగా పట్టించాలి.

నూనె వేడి చేసి అందులో బేబీకార్న్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను రంగు మారేదాకా వేయించాలి. అందులో బేబీకార్న్స్, మిగిలిన టొమోటో సాస్, సోయాసాస్‌లను వేసి బాగా కలపాలి. మరికాస్త ఉప్పుజల్లి పది నిమిషాలపాటు సన్నటి మంటపై వేయించాలి. తరువాత కొద్దిగా (ముక్కలు తడిసేలాగా) నీటిని చేర్చుకుని నీరు ఆవిరైపోయేంతదాకా ఉడికించుకోవాలి. చివరగా దించే ముందు కొత్తిమీర చల్లి అతిథులకు వడ్డించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: నాలుగేళ్లలో ఏపీని అన్నీ రంగాల్లో నెంబర్ 1గా మార్చేద్దాం: నారా లోకేష్

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

Show comments