Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీకార్న్ మంచూరియన్‌ను ఎలా తయారు చేస్తారు?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2012 (17:42 IST)
File
FILE
బేబీకార్న్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. పచ్చి బేబీకార్న్ లేదా ఉడకబెట్టిన బేబీకార్న్‌లను ఆరగించేందుకు కూడా అనేక మంది ఇష్టపడుతుంటారు. అలాంటి బేబీకార్న్‌తో తయారు చేసే బేబీకార్న్ మంచూరియాన్‌ను ఏ విధంగా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే..

బేబీకార్న్‌ : ఐదు
మొక్కజొన్న పిండి : అర కప్పు
బియ్యం పిండి : పావు కప్పు
కారం : కొద్దిగా
అల్లం వెల్లుల్లి మిశ్రమం : ఓ టీ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : బేబీకార్న్‌లను వేయించడానికి సరిపడినంత
ఉల్లిపొరక : సన్నగా తరగి పెట్టుకునే ఓ కట్ట
ఉల్లిపాయ : ఒకటి (సన్నగా తరగాలి)

తయారీ విధానం..
బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీల కోసం ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి.

బాణలిలో కాస్త నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి పలుకులు, ఉల్లిపాయ, ఉల్లిపొర ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి ఒక్కొక్కటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్‌ మంచూరియా మీ ముందు సిద్ధం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments