Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర ఆవకాయ చేసేది ఎలా..!!

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2012 (11:03 IST)
FILE
కావల్సిన పదార్థాలు :

బీరకాయలు - అరకేజీ,
చింతపండు - యాభై గ్రాములు,
మెంతిపిండి - చెంచా,
ఆవపిండి - చెంచా,
నూనె - పావుకప్పు,
కారం, ఉప్పు - తగినంత,
పసుపు - చెంచా,
పోపు దినుసులు - చెంచా,
కరివేపాకు - నాలుగు రెబ్బలు

తయారు చేసేవిధానం :

బీరకాయలను చెక్కు తీసి శుభ్రంగా కడిగి, తడి తుడిచి ముక్కలు కోసుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి సీసాలో పెట్టుకోవాలి. మర్నాడు ముక్కలను పిండి, పొడి వస్త్రం మీద వేసి ఆరు గంటల సమయం ఎండబెట్టాలి. అలానే చింతపండులో కాసిని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

పది నిమిషాలయ్యాక మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుతోపాటు, కారం, ఆవపిండి, మెంతిపిండిని బీరకాయ ముక్కల్లో కలపాలి. తరువాత చిన్న బాణలిలో మూడు చెంచాల నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు వేయించి దించేయాలి. చల్లారాక బీరకాయ ముక్కల్లో పోపు చేర్చి కలపాలి. మూడు నాలుగు రోజుల తరువాత తింటే రుచిగా ఉంటుంది బీర ఆవకాయ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Show comments