Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాపిల్ ఫ్రైడ్ రైస్

Webdunia
గురువారం, 8 జనవరి 2009 (18:06 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
ఫైనాపిల్ ముక్కలు... ఒక కప్పు
ఉల్లికాడల ముక్కలు.... ఒక కప్పు
పచ్చి బఠాణీలు... అర కప్పు
కాబూలీ శనగలు... అర కప్పు
సోయాబీన్ సాస్... ఒకటిన్నర టీస్పూన్
పంచదార... అర టీస్పూన్
మిరియాలపొడి... సరిపడా
వెల్లుల్లి పేస్టు... ఒక టీస్పూన్
ఉడికించిన రైస్... మూడు కప్పులు
క్యాప్సికమ్ ముక్కలు... అర కప్పు
మొక్కజొన్న గింజలు.... పావు కప్పు
టమోటో ముక్కలు... పావు కప్పు
టమోటో సాస్... ఒక టీస్పూన్
ఉప్పు... తగినంత
అల్లం పేస్టు... ఒక టీస్పూన్
నూనె.... అర కప్పు

తయారీ విధానం :
ముందుగా బఠాణీ, మొక్కజొన్న, శనగలు ఉడికించి ఉంచాలి. పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతూ వేపాలి. ఆ పేస్టుకి ఉల్లికాడల ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి తిప్పుతూ కాసేపు వేగిన తరువాత, పచ్చిబఠాణీలను కూడా కలిపి వేయించాలి.

పైన వేగుతున్న పదార్థానికి మొక్కజొన్న గింజలు, శనగలను కూడా కలపాలి. చివరగా ఫైనాపిల్ ముక్కలు, టమోటో ముక్కలను కూడా వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. ఉడికించిన అన్నంలో ఉప్పు, పంచదార, సోయా, టమోటో సాస్‌లను వేసి బాగా కలిపాలి. దీనికి వేయించి ఉంచిన పదార్థాలను కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే... ఫైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

Show comments