Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో వంకాయ పచ్చడి

Webdunia
బుధవారం, 21 జనవరి 2009 (16:52 IST)
కావలసిన పదార్థాలు :
వంకాయలు... ఐదు
పాలు... ఒక కప్పు
ఎండుమిర్చి.... 12
జీలకర్ర, అల్లం... కొద్దిగా
ఉప్పు, పసుపు... తగినంత
నూనె... 50 గ్రాములు
మినప్పప్పు... రెండు టీస్పూన్లు

తయారీ విధానం :
వంకాయలకు పైన నూనె రాసి నిప్పులపైన కాల్చాలి. ఉడికిన తరువాత తీసి, చల్లబడ్డాక తొక్కు తీసి మెత్తగా గుజ్జు చేసుకోవాలి. పాలు మరగపెట్టి చల్లార్చి, అందులో వంకాయ గుజ్జు కలపాలి.

కొంచెం నూనెవేసి జీలకర్ర, మినప్పప్పు, మిరపకాయలు, అల్లం వేయించి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కూడా పాలు, వంకాయ గుజ్జుతో కలపాలి. అందులోనే సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. అంతే పాలతో వంకాయ పచ్చడి సిద్ధమైనట్లే..!

దీన్ని అలాగే... వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు ఈ పచ్చడికి కరివేపాకు, ఆవాలతో పోపు కూడా పెట్టుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

Show comments