Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో పనీర్..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2009 (17:43 IST)
ND
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
నిమ్మరసం... రెండు కాయలది
పాలకు సరిపడా పాత్ర.. ఒకటి
శుభ్రమైన తెల్లటి వస్త్రం.. ఒకటి

తయారీ విధానం :
పనీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే... పెద్ద పాత్రలో పాలను పోసి అరగంటసేపు మరిగించిన తరువాత నిమ్మరసం వేయాలి. అలా చేస్తే పాలు విరిగిపోతాయి (ఒక లీటరు పాలకు రెండు నిమ్మకాయల రసం వేయాల్సి ఉంటుంది). పాలు విరిగిన తరువాత నీటిని ఒంపేసి మళ్లీ స్టవ్‌పై పెట్టి మరింత నిమ్మరసం వేసి మరిగించాలి. అలా నీరు మొత్తం పోయేదాకా అడుగంటకుండా జాగ్రత్తపడుతూ వేడిచేయాలి.

చివరగా పాల మిశ్రమాన్ని క్లాత్‌లో కట్టి నీరు పోయేటట్లుగా చేయాలి. ఆ తరువాత అది గట్టిగా తయారవుతుంది. దీన్ని రౌండ్ బాల్స్‌లాగా, చతురస్త్రాకారంగా, లేదా మనకు కావాల్సిన రీతిలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పనీర్‌ను వండేటప్పుడు చిదమాల్సిన, తురమాల్సిన పని ఉండదు.

అయితే.. టిక్కాలు, స్టిక్స్ లాంటివి చేసేటప్పుడైతే... వాటి ఆకారంలో వచ్చేలాగా పనీర్‌ను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత టైం లేకపోతే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పనీర్ వాడుకోవచ్చు. అయితే రెడీమేడ్ పనీర్ ప్యాక్ ఓపెన్ చేసిన తరువాత వారం రోజుల్లోపుగానే వాడేయాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

Show comments