Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలక్ కోఫ్తా కర్రీ

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2008 (17:08 IST)
కావలసిన పదార్థాలు :
బచ్చలికూర... 4 కట్టలు
ఉల్లిపాయలు... నాలుగు
బంగాళాదుంపలు... ఆరు
బ్రెడ్... 5 పీసులు
పాలు... ఒకటింపావు కప్పు
అల్లం... ఒక అంగుళం ముక్క
గరంమసాలా... ఒక టీస్పూను
నూనె... 2 గరిటెలు
డాల్డా... 3 టీస్పూన్లు
కారం... ఒక టీస్పూను
ఉప్పు, పసుపు... సరిపడా

తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి తోలు తీసి మెత్తగా చేసుకొని ఉంచాలి. దీనికి నీటిలో ముంచి తీసి పిండేసిన బ్రెడ్ ముక్కలు, ఉల్లి, మిర్చి ముక్కలు, కొత్తిమీర, గరంమసాలా, ఉప్పు, మామిడికాయ పొడి, బచ్చలికూర కొంచెం వేసి కలిపి ముద్ద చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని కోఫ్తాలలాగా తయారు చేసి పక్కన ఉంచాలి.

గ్రేవీకోసంగాను ఉల్లిపాయలు, బచ్చలి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో కొంచెం నూనె వేసి కాగిన తరువాత బచ్చలికూరను వేసి దానికి కొంచెం పంచదార కలిపి ఉడికించుకోవాలి. పంచదార వల్ల కూర రంగు మారదు. ఉడికిన తరువాత దింపి పేస్ట్‌లా చేసుకోవాలి.

బాండీలో 2 గరిటెల నూనె వేసి కాగిన తరువాత ఉల్లి ముక్కలు, మెత్తగా నూరిన అల్లం వేసి దాంట్లో బచ్చలి పేస్టు, పాలు, ఉప్పు, మామిడికాయ పొడి, గరంమసాలా, పసుపు, కారం వేసి గట్టిపడేంతవరకు ఉడికించి... దించే ముందు కోఫ్తాలను కలిపి వేడి వేడిగా వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

Show comments