Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకం పూరీ పొట్లాలు

Webdunia
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... ఒక కిలో
మైదా... 400 గ్రా.
రీఫైండ్ ఆయిల్... తగినంత
నెయ్యి... 200 గ్రా.
ఉప్పు... అర టీ.
పంచదార... మూడు కిలోలు
మంచినీరు... తగినంత
లవంగాలు... సరిపడా
యాలకుల పొడి... ఒక టీ.
బేకింగ్ పౌడర్... రెండు టీ.

తయారీ విధానం :
గోధుమ, మైదా, బేకింగ్‌ పౌడర్‌లు కలిపి అందులో ఉప్పు, కరిగించిన నెయ్యి పోసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దలా చేసి ఓ గంటసేపు నాననివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండనీ పలుచని పూరీలాగా చేసి...సగానికి కత్తిరించాలి. ఇప్పుడు ఒక్కో భాగాన్నీ మిఠాయి పొట్లంలా (కోన్‌లా) మడిచి విడిపోకుండా లవంగాన్ని గుచ్చాలి. ఇలా మొత్తం పిండినంతా చేసి పక్కన పెట్టుకోవాలి.

మందపాటి పాత్రలో పంచదార వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి యాలకుల పొడి కలిపి ఉంచాలి. కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పూరీ పొట్లాలను వేస్తూ దోరరంగులో వేయించి తీసి వేడివేడి పంచదార పాకంలో ముంచాలి. పది నిమిషాలు పాకంలో ఊరాక ట్రేలో వరసగా వాటిని అమర్చి మిగిలిన పాకాన్ని పైన పోయాలి. అంతే నోరూరించే పాకం పూరీ పొట్లాలు రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments