Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటీస్ స్పెషల్ ఫుడ్ "కాకర పిట్లై"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు.. ఆరు
కొబ్బరి తురుము.. రెండు కప్పులు
ఎండుమిర్చి.. పది
ధనియాలు.. రెండు టీ.
చింతపండు.. తగినంత
శెనగపప్పు.. ఆరు టీ.
కందిపప్పు.. పది టీ.
ఆవాలు.. ఒక టీ.
పసుపు.. అర టీ.
ఇంగువ.. చిటికెడు
ఉప్పు, నూనె.. సరిపడా

తయారీ విధానం :
కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, ఒక టీస్పూన్ శెనగపప్పు, ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటికి కొబ్బరి చేర్చి మెత్తగా రుబ్బి ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కందిపప్పు, మిగిలిన శెనగపప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి ఉడికించాలి. మరోవైపు చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచాలి. కాకరకాయలకు పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు, పావుకప్పు చింతపండు రసం వేసి ఉడికించాలి.

విడిగా మరో గిన్నె తీసుకుని అందులో మిగిలిన చింతపండు రసం పోసి మరిగించాలి. అందులో రుబ్బిన మసాలా ముద్దను వేసి బాగా ఉడికించాలి. చివర్లో ఉడికించిన కాకర ముక్కలు, కందిపప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇవన్నీ ఉడుకుతూ కూర దగ్గరగా వచ్చిన తరువాత దించేయాలి. చివర్లో ఆవాలు, ఇంగువ, కరివేపాకులతో పోపుచేసి కూరలో కలపాలి. అంతే కాకర పిట్లై తయారైనట్లే. ఇది మధుమేహ వ్యాధితో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments