Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టొమోటో ముస్సలం" ఓ పట్టు పట్టేద్దామా...?

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బెంగళూరు టొమోటోలు.. పది
దేశవాళీ టొమోటోల గుజ్జు... నాలుగు కప్పులు
ఉల్లిపాయముద్ద... ఒక కప్పు
కారం... రెండు టీ.
పసుపు... ఒక టీ.
అల్లంవెల్లుల్లి... రెండు టీ.
జీడిపప్పుముద్ద... అర కప్పు
కసూరిమేతి.. రెండు టీ.
నూనె... అర కప్పు
ఉప్పు... తగినంత
గరంమసాలా... అర టీ.
పెరుగు... ఒక కప్పు

తయారీ విధానం :
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి బెంగళూరు టొమోటో (కాయ మొత్తాన్ని)లను వేసి రెండువైపులా వేయించి తీసేయాలి. ఇప్పుడు ఆ టొమోటోలకు తొక్క తీసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిముద్ద వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలియబెట్టాలి. టొమోటో గుజ్జును కూడా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా వేయించాలి.

ఇప్పుడు అందులోనే పెరుగు, తగినన్ని నీళ్లుపోసి పచ్చివాసన పోయేంతదాకా ఉడికించాలి. దాంట్లోనే జీడిముద్దను కూడా వేసి ఉడికించాలి. చివరగా బెంగళూరు టొమోటోలను, కసూరిమేతిని వేసి కలియబెట్టి, గరంమసాలా చల్లి, ఉప్పు సరిజూసి... కాసేపటి తరువాత దించేయాలి. అంతే టొమోటో ముస్సలం తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments