Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చుక్కకూర మటన్ కర్రీ" హెల్దీ అండ్ టేస్టీ..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
లేత పొట్టేలు మాంసం.. ఒక కేజీ
నూనె.. తగినంత
ఉల్లిపాయలు.. ఎనిమిది
చుక్కకూర.. రెండు కట్టలు
వెల్లుల్లి.. 14 రేకలు
పచ్చిమిర్చి.. ఎనిమిది
యాలకులు.. నాలుగు
లవంగాలు.. ఐదు
దాల్చిన చెక్క.. మూడు
అల్లం.. కాస్తంత
పసుపు, ఉప్పు, కారం.. తగినంత
ధనియాలు.. తగినన్ని
కొత్తిమీర.. 3 పెద్ద కట్టలు

తయారీ విధానం :
ముందుగా మటన్‌‌ను శుభ్రంగా కడిగి, కావాల్సిన సైజులో కోసుకోవాలి. యాలకులు, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను కలిపి మెత్తగా నూరుకోవాలి. చుక్కకూరను సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.

అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను.. ఉప్పు, కారం, పసుపులను వేసి బాగా కలియబెట్టి నీళ్లుపోసి ఉడికించాలి. మాంసం బాగా మెత్తబడేలా ఉడికిన తరువాత పైన చుక్కకూరను చల్లి, బాగా కలిపి ఉడికిన తరువాత దించేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చుక్కకూరతో మటన్ కర్రీ తయార్..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments