Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుడు గింజలతో గ్రేవీ తయారు చేయడం ఎలా?

Webdunia
గురువారం, 3 జనవరి 2013 (18:12 IST)
FILE
చిక్కుడులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. అలాంటిది చిక్కుడు గింజలు రోజు వారీగా అరకప్పు తింటే డయాబెటిస్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగని చిక్కుడు గింజల్ని రోజూ ఉడికించి తినడం బోరు కొడుతుందని అనుకుంటున్నారా.. అయితే చిక్కుడు గింజలతో గ్రేవీ ఎలా చేయోలో ట్రై చేయండి.

కావల్సిన పదార్థాలు :
చిక్కుడు గింజలు- పావుకిలో
టమాటాలు - నాలుగు
ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిర్చి- మూడు
అల్లం వెల్లుల్లి - చెంచా
గరంమసాలా - చిటికెడు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కట్ట
ఉప్పు - రుచికి సరిపడా.

తయారు చేయు విధానం :
ముందుగా చిక్కుడు గింజలను కడిగి కుక్కర్‌లో మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. తరువాత టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి

తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పసుపు, రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. పచ్చివాసన పోయిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, తగినంత, ఉప్పు చేర్చాలి. కొద్దిసేపటికి రెండు గ్లాసుల నీళ్ళుపోసి మూత పెట్టాలి.

గ్రేవీ కాస్త దగ్గరపడ్డాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు చేర్చి కలియతిప్పాలి. రెండు, మూడు నిమిషాలు గింజలు గ్రేవీలో ఉడికాక పొయ్యి కట్టేసి కొత్తిమీర చల్లి దించేస్తే సరి. కూరగాయల బిర్యానీలోకి ఇది చక్కటి సైడిష్‌గా ఉంటుంది. చపాతీలు, పుల్కాల్లోకి నంజుకొని తింటే బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

Show comments