Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ఫ్రై విత్ ఆలీవ్ ఆయిల్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్.. అర కేజీ
ఆలీవ్ ఆయిల్.. తగినంత
టొమోటోలు.. వంద గ్రా.
కారంపొడి.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
పసుపు.. ఒక టీ.
అల్లంవెల్లుల్లి ముద్ద.. రెండు టీ.
షాజీరా పొడి.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక కట్ట
కరివేపాకు.. కొద్దిగా
లవంగంపొడి.. ఒక టీ.
యాలకులపొడి.. ఒక టీ.
దాల్చినచెక్కపొడి.. ఒక టీ.
మొగ్గపొడి.. ఒక టీ.
మరాటి మొగ్గ పొడి.. ఒక టీ.
గసగసాలు, కొబ్బరిపేస్టు.. ఒక టీ.
ఉల్లిపాయలు.. 50 గ్రా.

తయారీ విధానం :
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసి అందులో ఉప్పు, పసుపు, కారం, కాస్తంత పెరుగును కూడా వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కనుంచాలి. ఆపై కాసేపు ఉడికించి ఉంచాలి. ఒక గిన్నెలో ఆలీవ్ ఆయిల్ వేసి కాగిన తరువాత టొమోటో, ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. ఆపై అల్లంవెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ముందు చికెన్‌ని ఉడికించేటప్పుడు కారం, ఉప్పు వేశాం కాబట్టి, ఇప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది.

మసాలా పొడులు, కొబ్బరి గసగసాల ముద్దను కూడా ఇందులో వేసి వేయించాలి. చివర్లో ఉడికించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి, మూతపెట్టి 10 నిమిషాలపాటు మగ్గనివ్వాలి. ముక్క ఉడికిన తరువాత దించేముందుగా ధనియాలపొడి వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు, కరివేపాకును చల్లి దించేస్తే చికెన్ ఫ్రై విత్ ఆలీవ్ ఆయిల్ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

తిక్క రేగిందంటే ఏం చేస్తానో తెలియదు : డోనాల్డ్ ట్రంప్

YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్

అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ విజయం సాధించబోతోంది: నవీన్ చంద్ర

Show comments