Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ కట్‌లెట్స్

Webdunia
శుక్రవారం, 6 ఫిబ్రవరి 2009 (19:07 IST)
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్... పావుకేజీ
కోడిగుడ్ల సొన... రెండు గుడ్లది
పాలు... ఒకటిన్నర కప్పు
జాజికాయ పొడి... అర టీ స్పూన్
నూనె... వంద గ్రాములు
బ్రెడ్ ముక్కలు... ఒక కప్పు
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు... రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి... అర టీ స్పూన్
బటర్... కొద్దిగా

తయారీ విధానం :
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో బటర్‌ను వేసి అందులో పాలు చేర్చి కలుపుతూ వుండాలి. కొంచెం మరిగాక ఉడికించిన బోన్‌లెస్ చికెన్ పీస్‌లను అందులో వేయాలి. కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడిని చేర్చి ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించాలి. బాగా ఉడికాక దించేసి కాసేపు ఆరనివ్వాలి.

మిశ్రమం చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా కాని కోడిగ్రుడ్డు ఆకారంలో గానీ కట్‌లెట్స్ వొత్తుకోవాలి. ఈ కట్‌లెట్స్‌ను కార్న్‌ఫ్లోర్‌లో అటు ఇటు ఒత్తి పక్కన పెట్టుకోండి. గిలకొట్టిన కోడిగ్రుడ్డు తెల్లసొనలో ఈ ఒత్తిపెట్టుకున్న కట్‌లెట్‌లను ముంచి, వెంటనే బ్రెడ్ ముక్కల పొడిలో వత్తి కాసేపు ఆరనివ్వాలి.

ఓ అరగంట తర్వాత... బాణలిలో నూనె పోసి మరుగుతుండగా ఈ కట్‌లెట్స్‌ను అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే చికెన్ కట్‌లెట్స్ రెడీ అయినట్లే..! వీటిని చిల్లీసాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments