Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడీగుల ఫేవరెట్ డిష్ "బిసిబేళాబాత్"

Webdunia
కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు.. 200 గ్రా.
గోరుచిక్కుళ్లు.. 50 గ్రా.
బంగాళాదుంపలు.. వంద గ్రా.
క్యారెట్.. రెండు దుంపలు
మునక్కాయలు.. ఆరు
చింతపండు.. 25 గ్రా.
కందిపప్పు.. వంద గ్రా.
బియ్యం.. ఒక కిలో
నూనె.. వంద గ్రా.
ఎండుమిర్చి.. ఆరు
నెయ్యి.. గరిటెడు
లవంగాలు.. పది
దాల్చినచెక్క, ఉప్పు, పసుపు, కరివేపాకు.. తగినంత
పచ్చి శనగపప్పు.. 50 గ్రా.
ధనియాలు.. ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా కూరగాయలన్నింటినీ చిన్నసైజు ముక్కల్లాగా తరిగి ఉంచాలి. బాణలిలో తగినంత నూనె పోసి.. కూరగాయల ముక్కల్ని వేసి బాగా వేయించి రెండు గ్లాసుల నీటిని పోయాలి. పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. ఈలోగా కుక్కర్‌లో బియ్యం, కందిపప్పులను విడి విడిగా ఉడికించి ఉంచాలి. అలాగే శనగపప్పు, మిర్చి, మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నెలో అన్నం, పప్పు, ఉడికించిన కూరగాయల ముక్కలు, మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు పిసికిన నీటిని, తగినంత ఉప్పు, నెయ్యి, పసుప్పొడిని వేసి గరిటె జారుగా అయ్యేటట్లుగా కలపాలి. దీన్ని కాసేపు స్టౌమీద ఉంచి వేడి చేయాలి. దించేముందు నెయ్యితో పోపుపెట్టిన కరివేపాకును వేసి కలపాలి. అంతే బిసిబేళాబాత్ తయార్.. కన్నడ ప్రజలకు చాలా ప్రీతిపాత్రమైన.. ఈ వంటకాన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments