Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ మటన్ జింజర్ గార్లిక్ స్పెషల్

Webdunia
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్‌ మటన్... అరకేజీ
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీ.
కోడిగ్రుడ్లు.... నాలుగు
పచ్చిబొప్పాయి తురుము... నాలుగు టీ.
పచ్చిమిర్చి... ఎనిమిది
గరంమసాలా... అర టీ.
పెరుగు... ఒక కప్పు
ఉప్పు... తగినంత
నిమ్మకాయలు... రెండు
కొత్తిమీర తరుగు... రెండు కప్పులు
మిరియాల పొడి... ఒక టీ.
నూనె... తగినంత

తయారీ విధానం :
మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా కోసి మిక్సీలో బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు మటన్‌లో అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, గరంమసాలా, బొప్పాయి తురుము వేసి కలపాలి. ఈ ముద్దను ఓ వెడల్పాటి ప్లేటులో వేసి తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం, తురిమిన కొత్తిమీర కలిపి చిన్న ఉండలుగా చేయాలి.

పెనం పొయ్యిమీద పెట్టి కొద్దికొద్దిగా నూనె వేస్తూ ఒక్కో ఉండనూ చిన్నగా ఒత్తి పెనంమీద అటూ ఇటూ కాల్చాలి. కోడిగుడ్ల సొనలో ఉప్పు వేసి గిలకొట్టి ఓ గరిటెడు మిశ్రమాన్ని పెనంమీద పలుచని ఆమ్లెట్‌లా వేయాలి. ఇప్పుడు అందులో వేయించి మటన్ ఉండను పెట్టి, దాన్ని ఆమ్లెట్‌తో మూసివేసి రెండువైపులా వేయించి తీసేయాలి. అంతే ఎగ్ మటన్ జింజర్ గార్లిక్ స్పెషల్ తయారైనట్లే..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments