Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజీర్తిని దూరం చేసే "అల్లం నిల్వ పచ్చడి"

Webdunia
కావలసిన పదార్థాలు :
అల్లం... వంద గ్రా.
చింతపండు... వంద గ్రా.
బెల్లంతరుగు... వంద గ్రా.
ఎండుమిర్చి... పది
ఉప్పు... తగినంత
నూనె... ముప్పావు కప్పు
మెంతులు... ఒక టీ.
ధనియాలు.. రెండు టీ.
జీలకర్ర.. ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
వెల్లుల్లి... పది రెబ్బలు
నూనె... మూడు టీ.

తయారీ విధానం :
పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం ముక్కలను నాలుగు నిమిషాలపాటు వేయించి, చల్లారనివ్వాలి. వేడినీటిలో చింతపండు నానబెట్టి, చల్లారాక గుజ్జు తీయాలి. మళ్లీ పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి మెంతులు వేయించాలి. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరికాసేపు వేయించాలి. చల్లారిన తరువాత వీటిని పొడిచేసి పక్కనుంచాలి.

చల్లారిన ముక్కలను గ్రైండ్ చేసుకుని, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లోనే గ్రైండ్ చేసిన మెంతి, ధనియాలపొడులను కలపాలి. పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపును పేస్ట్ చేసిన అల్లం పచ్చడిలో కలపాలి. దీనిని గాలి చొరబడని బాటిల్‌లో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఈ పచ్చడి దోసె, ఇడ్లీ, అన్నంలలోకి చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments