Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్ర్యమే ఊపిరిగా నరనరాన స్వేచ్ఛాగీతిక

పుత్తా యర్రం రెడ్డి
FileFILE
విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ దేశభక్తిని ఉత్తేజ పరచిన గడ్డ ఇది.... హోంరూల్ ఉద్యమంతో తెల్లదొరలకు ముచ్చటలు పట్టించిందీ పల్లె.. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది. సాతంత్ర్య ఉద్యమకారుల ధాటిని తట్టుకోలేక అప్పటి కడప జిల్లా కలెక్టర్ రాయలసీమ జిల్లాల్లో మదనపల్లె ప్రముఖ తీవ్రవాద, తిరుగుబాటు కేంద్రంగా పేర్కొంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు.

ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇక్కడి ప్రజల పోరాట పటిమకు నిదర్శనం. బ్రిటీషు పాలకుల బూటు చప్పుళ్ళకు భయపడే రోజులవి. ఇలాంటి పరిస్థితులలో మహాత్మగాంధీ 1929లో బీటీ కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన బరహిరంగ సభకు 18000 మంది హాజరయ్యారు. గాంధీజీ ఉపన్యాసానికి ఆకర్షితులై ఎంతో మంది మదనపల్లె యువకులు ఉద్యమబాట పట్టారు.

క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. అప్పటి బీటీ కాలేజి విద్యార్థులైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే సిదాస్, నూతి రాధా కృష్ణయ్యలతోపాటు 40మందిని అరెస్టు చేశారు.

కర్ణాటక రాష్ట్రం, బళ్ళారి జిల్లాలోని అలేపురం జైల్లో నిర్భందించారు. వీరిలో 28 మందికి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. భారతదేశం సగర్వంగా పాడుకునే జాతీయగీతాన్ని జనగణమనను మరాఠీలో రచించారు. 1919లో విశ్వకవి రవీంధ్రనాథఠాగూర్ మదనపల్లె వచ్చారు. నేషనల్ కళాశాలగా ఉన్న ప్రస్తుత బీటీ కళాశాల అప్పటి ప్రిన్సిపల్ కజిన్స్ ఆహ్వానం మేరకు రవీంధ్రుడు కళాశా ఆవరణలో బస చేశారు.

FileFILE
ఇక్కడి వాతావణానికి ముగ్ధుడైన విశ్వకవి 1919 ఫిబ్రవరి 28న జనగణమన జాతీయగీతాన్ని ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. దానికి ఇక్కడే బాణీ కట్టినట్లు చెపుతారు. అప్పుడే కళాశాల విద్యార్థలచే ఆలపింపజేశారు. తరువాత అప్పట్లోనే కళాశాల నిత్య పార్థనా గీతంగా మారింది.

ఆ గీతమే నేడు జాతీయగీతంగా ఉంది. ఇలా సాతంత్ర్య సంగ్రామంలో మదన పల్లె సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రముఖ సాతంత్ర్య సమరయోధులు మదనపల్లెను సందర్శించారు. 1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమం మదనపల్లెను అట్టుడికించింది. బీటీ కళాశాల విద్యార్థులు తమ పోరాట పటిమను చాటారు.

1946 లో కర్ణాటకలోని మైసూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకు మదనపల్లె నుంచి 20 మంది ఛలో మైసూర్ కార్యక్రమానికి వెళ్లారు. మార్గ మధ్యమంలో ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులు జైలులో ఉంచారు. ఈ కార్యక్రమానికి నూతి రాధాకృష్ణయ్య నాయకత్వం వహించారు. 1934లో డాక్టర్ బాబు రాజంద్రప్రసాద్ బీటీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించారు.

1936 లో ప్రకాశం పంతులు అయ్యదేవర కాళేశ్వర రావు, కల్లూరి సుబ్బరావు, ఆచార్య రంగా, కమలాదేవి ఛటోపాధ్యాయ, మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శన, బహిరంగ సభలు జరిగాయి. 1940లో సర్ సీవీ రామన్ బీటీ కాలేజీని సందర్శించారు. 1947 ఆగస్టు15న అర్ధరాత్రి మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇది తెలిసిన విద్యార్థులంతా సమావేశమై బ్రిటీష్ పతాకాన్ని తగులబెట్టారు. మన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వతంత్ర భారత్‌కీ జై అంటూ నినాదాలు చేశారు.

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

Show comments