Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాధి నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే లవంగాలు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2016 (11:25 IST)
కేరళ రాష్ట్రంలో సర్వసాధారణంగా లభించే సుగంధ ద్రవ్యం లవంగాలు. లవంగాలు, గరం మసాలాలో ప్రధానమైన పదార్థం. గరం మసాలాలో లవంగాలే రారాజు. లవంగాలు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, లవంగాలకు వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగం నూనెను పంటి నొప్పికి మందుగా ఉపయోగిస్తారు. బాగా నలిపిన లవంగ ఆకులు పంటి నొప్పికి ఉపశమనాన్ని ఇస్తాయి. ఎసిడిటి మరియు అజీర్ణానికి లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. క్వాలిటీ మరియు సీజన్ల బట్టి ధరలు మారుతుంటాయి. రుచి, కారం కోసం కూరలలో ఎక్కువగా వాడుతుంటారు. అటువంటి వంటకు మాత్రమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. లవంగాలు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!
 
లవంగాల నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.
ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగం తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.
జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
లవంగాలు తరచు తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది.
లవంగాలు సేవించడం వల్ల తెల్ల రక్త కణాలను పెంపొందుతాయి. అంతేకాదు జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది. 
తలనొప్పిగా ఉన్నప్పుడు, కొన్ని లవంగాలను మెత్తగా నూరి ఆ పేస్టుని తలపై పెట్టుకుంటే కాసేపటికి తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

Show comments