Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమటకాయల నివారణలో హోమియో

Webdunia
చెమటగ్రంథుల్లో తయారయ్యే చెమట బయటకు రావాలంటే స్వేదనాళాలు తెరచుకుని ఉండాలి. ఒకవేళ ఈ నాళాలు మూసుకుపోయినట్లయితే చెమట చర్మం ఉపరితలం మీదకు రాలేక, లోపలే ఉండిపోతుంది. దీంతో చిరాకు, చర్మమంతా చురుకుగా, మంటగా ఉండటం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

చెమటకాయలు మొండెం, తొడల ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటాయి. వీటి బారినుండి బయటపడాలంటే, ఎండ వేడిమి ప్రభావం శరీరానికి ఎక్కువగా తగలకుండా, సాధ్యమైనంతవరూ ఎండాకాలంలో చల్లటి ప్రదేశాలలో, నీడపట్టున ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలను పాటించిన ఆ తరువాతనే వైద్య సహాయం తీసుకోవాలి. చెమటకాయల సమస్య నుండి దూరమయ్యేందుకు హోమియో వైద్యం చక్కగా పనిచేస్తుంది.

హోమియో మందులలో ముఖ్యమైనది "ఏపిస్"... సున్నితమైన చర్మం కలవారు, తాకితేనే బాధ, చురుకులు, మంటలు, కందిపోయినట్లు ఉండటం, దద్దుర్లు తదితర సమస్యలతో బాధపడేవారు ఈ మందును తీసుకోవచ్చు. ఇలాంటి చర్మం కలిగినవారు ఒంటిపైన చల్లటి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుంది. చల్లటి గాలి కూడా వీరికి హాయినిస్తుంది.

" రస్టాక్స్"... ఈ మందు చర్మంపై నీటి బుగ్గల్లాగా వచ్చే దద్దుర్లతో బాధపడే రోగులు వాడవచ్చు. ఇలాంటి వారు ఈ మందు తీసుకోవడంతోపాటు వెచ్చటి నీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కాస్తంత స్థిమితపడతారు.

" నేట్రంమోర్"... అసలు ఎండ అంటేనే గిట్టని వ్యక్తులకు ఇది పరమౌషధం అని చెప్పుకోవచ్చు. ఎండలోకి వెళితేనే తలనొప్పి, చర్మంపై దద్దుర్లు లేకపోయినా దురద, చురుకులు, చర్మం కందిపోయి దురద రావడం, నెత్తురు గడ్డలు కట్టడం లాంటి సమస్యలతో బాధపడేవారు ఈ మందును వాడవచ్చు.

ఇదిలా ఉంటే... ఎండలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ "నేట్రంమోర్ 30ఎక్స్" వేసుకోవడం మంచిది. బీపీ ఉండేవారు ఎండలోకి వెళ్లేముందు "గ్లొనాయిన్ 30ఎక్స్" వాడాలి. వేసవిలో కూల్ డ్రింకులు ఎక్కువగా తాగి విరేచనాలు పట్టుకునేవారు "బ్రయోనియా" మందును వాడవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments