ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి... ఆ తర్వాత తాగితే...

మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషధ గుణాలను ఇప్పుడు తెలు

Webdunia
గురువారం, 31 మే 2018 (17:54 IST)
మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషధ గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి.
 
2. నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
 
3. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి.
 
4. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి.
 
5. ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే పురుషులలో ఏర్పడే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.
 
6. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా భాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.
 
7. 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

తర్వాతి కథనం
Show comments