Webdunia - Bharat's app for daily news and videos

Install App

శొంఠితో కలిగే ప్రయోజనాలు ఏమిటి

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (23:54 IST)
ఎండిన అల్లం శొంఠి అవుతుంది. అల్లం, శొంఠి రెండింటిలోను కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, అల్లం ప్రధానంగా చలవచేస్తుంది. శొంఠి వేడి చేస్తుంది. జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది.
 
అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
 
శరీరంలోని అగ్ని (జఠరాగ్ని) సక్రమంగా పని చేస్తుంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అగ్ని మందగించినా, విషమించినా శరీరానికి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అగ్నిని సక్రమంగా పని చేయించే ద్రవ్యాలలో అల్లం ఒకటి. ప్రతిరోజు ఉదయాన్నే చిన్నచిన్న అల్లం ముక్కలు 4 లేక 5 సైంధవ లవణంతో కలిసి, నమిలి తినడం ఆరోగ్యకరం. జలుబు – గొంతు నొప్పి ఉన్నప్పుడు అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని నాకడం వలన ఉపశమనం కలుగుతుంది. 
 
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు 20.మి.లీ. అల్లం రసం 20 మి.లీ తేనె కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే సుఖ విరోచనం అయ్యి, కడుపులోని వాయువులు కూడా బయటికి పోయి, నొప్పి తగ్గుతుంది. అల్లం రసం తీసుకోవడం వలన మూత్రం సాఫీగా అవుతుంది. ఆకలి మందగించినపుడు అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, నోటిలో రుచి తెలియకపోవడం – ఇలా జీర్ణ మండలానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలకైనా అల్లం ఒక దివ్యౌషధం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments