Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల జాతిలో మేలైనది దానిమ్మ

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (22:38 IST)
తినటానికి రుచికరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ, డి 5 ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. పండే బంగారంగా చెట్టే ఔషదంగా చెప్పే దానిమ్మ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. రక్త శుద్ధికి దానిమ్మను మించిందిలేదు.

ప్రతిఒక్కరు రోజుకు కాసిని దానిమ్మ గింజలు తింటే కలిగే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. చైనాలో దానిమ్మ మొక్క లేని ఇల్లు ఉండదు. దానిమ్మలో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లంటే రక్తంలోని కొలెస్ట్రాల్ కు భయం. అందుకే హృద్రోగులకు చాలా మంచిది.
 
ఆరోగ్యానికి మేలుచేసే దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలతో పాటు గాయాలను నయం చేసే సత్వర శక్తిని ప్రసాదించే పోషకాలు మెండుగా ఉన్నాయని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.

వాపు ప్రక్రియను నివారించే యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ పండులో ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెడ్ వైన్‌, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెండ్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
 
100గ్రాముల దానిమ్మ గింజల్లో 83 క్యాలరీల శక్తి, 18గ్రాముల పిండిపదార్ధాలు, 4గ్రాముల పీచు, కొవ్వులు 1.17గ్రాములు, ప్రొటీన్లు 1.68గ్రాములు, విటమిన్ సి 10.2 గ్రాములు, క్యాల్సియం 10మిల్లీగ్రాములు, మెగ్నీషియం 12 మిల్లీగ్రాములు, పొటాషియం 259 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 36 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఎర్రగా, నిగనిగలాడుతూ కంటికి చూసేందుకు ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
కాలుష్యం, ధూమపానంతో పేరుకుపోయే టాక్సిన్స్‌ను శుభ్రపరిచేందుకు ఉపకరించే యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నివారించే ఔషధ గుణాలు ఈ అద్భుత ఫలంలో మెండుగా ఉంటాయి. క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.

దానిమ్మ రసంతో హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన ఫైబర్ దానిమ్మపండ్లలో అధికం. కప్పు దానిమ్మ గింజల్లో ఏకంగా ఏడు గ్రాముల పైబర్ ఉంటుంది.
 
దానిమ్మవృద్ధాప్య చాయలు తగ్గిస్తుంది. సహజ యాస్పిరిన్ గా పనిచేస్తూ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అంగస్తంభన సమస్యలకు దానిమ్మ బాగా పనిచేస్తుంది. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

నెలలు నిండకుండానే గర్భస్రావాల నుండి బయటపడాలంటే గర్భం ధరించిన వారు ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగటం మంచిది. రుతుస్రావం సమయంలో ఉండే ఇబ్బందులను తగ్గిస్తుంది. అంగస్తంభన సమస్యలను తగ్గిస్తుంది. రక్త నాళాలు మూసుకుపోయే పరిస్ధితుల నుండి దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల బయటపడవచ్చు.

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే కోడలు త్రిషా రెడ్డి.. బాబు ప్రమాణ స్వీకారంలో హైలైట్

నోటి దూల వల్లే ఓడిపోయాం.. అనిల్ యాదవ్

సీఎం చంద్రబాబు నాయుడికి పూలబాట వేసిన అమరావతి రైతులు (video)

బీఆర్ఎస్‌కు కొత్త చిక్కు.. గొర్రెల పంపిణీలో అవకతవకలు

ఏపీలో కొలువుల జాతర - 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు.. సంతకం చేసిన సీఎం చంద్రబాబు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

తర్వాతి కథనం
Show comments