పుదీనా రసం, పచ్చడి, కషాయం... చేసే మేలు ఏమిటో తెలుసా...?

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (15:54 IST)
కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే, వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.
 
* చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు.
 
* గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాదపదేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ టైమ్ పూర్తయింది.. ఇపుడు మా టైమ్ మొదలైంది : కె.కవిత

మహిళ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదు : ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణాలో జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డిన్నర్ మీట్ కాల్పుల నిందితుడు మెకానికల్ ఇంజనీర్...

కూల్‌డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

మీడియాకు వార్నింగ్ ఇస్తున్న బిగ్ బాస్ ఫేం అషురెడ్డి

పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం.. బిగ్ బాస్ అషురెడ్డిపై కేసు

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Show comments