బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే?

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (22:00 IST)
బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలతో పాటు పపైన్ అనే జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి.
 
బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 
బొప్పాయి పాలల్లో కొబ్బరినూనె లేదా నెయ్యి కలిపి గజ్జి, చిడుము వంటి చర్మవ్యాధులపై పూయడం వల్ల అవి తగ్గిపోతాయి.
 
ముసాంబరాన్ని బొప్పాయి పాలతో నూరి సెనగగింజంత మాత్రలు చేసి రెండు పూటలా ఒక్కో మాత్ర తీసుకుంటుంటే స్త్రీలలో ఋుతుక్రమం బాగా విడుదలవుతుంది. బొప్పాయి కాయను కొబ్బరికోరులా తరిగి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి స్తనాల్లో గడ్డలుపై వేసి కట్టుకడుతుంటే నొప్పులు, పోటు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది : డోనాల్డ్ ట్రంప్

నేడు బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments