Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లజోడు పెట్టుకుంటే ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చల నివారణకు చిట్కాలు!

ప్రస్తుత కాలంలో కళ్లజోడు పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కొందరు నేత్ర సమస్యల కారణంగా పెట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కంటి అద్దాలను పెట్టుకుంటారు.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:03 IST)
ప్రస్తుత కాలంలో కళ్లజోడు పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కొందరు నేత్ర సమస్యల కారణంగా పెట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కంటి అద్దాలను పెట్టుకుంటారు. అయితే, అద్దాలు ఎందుకు పెట్టుకున్నా సరే.. ముక్క మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. క్రమం తప్పకుండా, రేయింబవుళ్లు పెట్టుకునే వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల వల్ల అంద విహీనంగా మారే అవకాశం లేకపోలేదు. ఇలాంటి మచ్చలను చిన్నపాటి చిట్కాలతో ఇంటిపట్టునే నివారించుకోవచ్చు. అవేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
కలబంద రసం నల్లటి మచ్చలను తొలగించే గుణం ఉంది. ఇది ముక్కపై నల్లని మచ్చ ఉన్న ప్రాంతంలో ప్రతి రోజూ రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. 
 
దోసకాయ ముక్కలు పిగ్మెంటేషన్ ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. నల్లటి మచ్చ ఉన్న ముక్కుపై దోసకాయ ముక్కను పెట్టడం వల్ల ఈ మచ్చలు మాయమయ్యే అవకాశం ఉంది. 
 
సహజంగానే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిమ్మరసం కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం, నీరు లేదా తేనె మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై పూయడం వల్ల ఈ మచ్చలను తొలగించవచ్చు. 
 
ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించటంలో తేనే సహాయపడుతుంది. నల్లని మార్కులపై తేనెను రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు నల్లని మార్కులపై రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
 
బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అందువలన కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. అలాగే, నారింజ తొక్కల పొడి కళ్ళజోడు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది. నారింజ తొక్కల పొడిలో కొంచెం పాలను పోసి పేస్టుగా చేయాలి. ఈ పేస్టుని ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసినట్టయితే ఫలితం కనిపిస్తుంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments