Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు రసం... ఉపయోగాలు

గోరింటాకులో ఔషధగుణాలు ఉన్నాయి. కాండిడా అనబడే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి గోరుపుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఉంటుంది. అరికాళ్లు మంటపెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా వ్రాస్తే అరికాళ్ళమంట

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (22:54 IST)
గోరింటాకులో ఔషధగుణాలు ఉన్నాయి. కాండిడా అనబడే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి గోరుపుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఉంటుంది. అరికాళ్లు మంటపెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా వ్రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది. అవసరం అయినప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. 
 
సెగగడ్డలు వచ్చి ఎంతకూ పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ గడ్డలపైన వేస్తే సెగగడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కాళ్ళు చేతులు మంటపెడుతుంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు నాలుగురెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో వ్రాస్తుంటే తగ్గుతుంది.
 
కీళ్ళు నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కీళ్ళకు పట్టువేస్తే తగ్గుతాయి. గోరింటాకును బాగా నూరి, యోని రంధ్రానికి ప్రతిపూటా వ్రాస్తూ ఉంటే తెల్లకుసుమ వ్యాధి రెండురోజుల్లో తగ్గుతుంది. మూత్రము వెంట ఇంద్రియము (వీర్యము) పోవునప్పుడు గోరింటాకు రసాన్నిరోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు త్రాగుతుంటే తగ్గుతుంది. 
 
తలకు గోరింటాకు రసాన్ని మర్థనా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం వ్రాస్తుంటే చుండ్రు పోతుంది. తల చిన్నతనంలోనే నెరపు ఉంటే లేక తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్‌ డైలు రాయాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో అయితే హెయిర్‌ డైలు ఉన్నాయి కానీఈ పూర్వం సౌందర్య సాధనాలలో గోరింటాకు ముఖ్యంగా ఉపయోగించేవారు. నేటికీ గోరింటాకును వాడడం చాలా చోట్ల చూస్తాయి. హెన్నా అని పిలిచేది కూడా గోరింటాకునే. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుపమూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తరువాత తలస్నానం చేయాలి.  ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు నలుపురంగులోకి మారుతుంది. గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. గోరింటాకు విత్తనాలు విరేచనాలు ముఖ్యంగా నీళ్ళ విరేచనాలను అరికడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

తర్వాతి కథనం