కరివేపాకుతో చెమట - మొలల సమస్యకు చెక్

Webdunia
సోమవారం, 11 జనవరి 2016 (15:32 IST)
కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమటలోని చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలలో కాకుండా కేశ సంరక్షణకు కూడా ఉపయోగిస్తున్నారు. 
 
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు చెట్టు పెరట్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే దీనినుంచే వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. 
 
కరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనాభరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు.
 
కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమేకాకుండా శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.
 
జుట్టురాలే సమస్య ఉన్నవారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించాలి. మరిగించిన ఈ నూనెను ప్రతిరోజు తలకు పూసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేజ్రీవాల్ విధానాల వల్లే బీజేపీలో చేరాం : రాఘవ్ చద్దా

ఇప్పటివరకు పిట్టల దొరను చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు : ధర్మపురి అరవింద్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. కానీ ఇడ్లీ తిని ఓ బాలింత మృతి

మైనర్లపై లైంగిక వేధింపులు - అమెరికాలో తెలుగు వ్యక్తికి 20 యేళ్ల జైలుశిక్ష

ప్రజలకు శుభవార్త.. ఈ ఏడాది ముందే దేశాన్ని తాకనున్న రుతుపవనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Show comments