Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములగ కాయ విత్తనాలతో బి.పి. కంట్రోల్....

ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి. ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (21:26 IST)
ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి. ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది.
 
మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. ములగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు. 
 
ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ములగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 
 
ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెలరోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. ములగ పూలు, పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం