పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

సెల్వి
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (13:10 IST)
పిల్లల కడుపుకు శొంఠి ఎంతో మేలు చేస్తుంది. శొంఠిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిల్లలకు వారానికి ఒక్కసారైగా ఒక స్పూన్ వరకు శొంఠి పొడిని ఆహారంలో భాగం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా శొంఠి పొడి కలిపి పిల్లలకు వారానికి ఒకసారి ఇవ్వడం ద్వారా పిల్లల్లో జీర్ణక్రియ రుగ్మతలు వుండవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా దరిచేరవని వారు చెప్తున్నారు. వేడి పాలలో చిటికెడు శొంఠి పొడిని రోజూ వేసి పిల్లలకు తాగిస్తే.. అనారోగ్య సమస్యలుండవు.
 
అలాగే పెద్దలు ఈ శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా బరుగు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు.
 
శొంఠి పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. ఇందుకోసం ముందుగా శొంఠిని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, వాము, ధనియాలు వేయించుకొని.. అన్ని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు. రోజూ ఒక ముద్ద శొంఠి అన్నం తింటే బరువు తగ్గడం ఖాయమని వారు చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments