Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేత కొబ్బరి... ముదురు కొబ్బరి... హాని-మేలు

పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతుంటారు. కొబ్బరిని అధిక మోతాదులో తినరాదు. కొబ్బరి దగ్గు, నెమ్ము ఆయాసాలను కలిగిస్తాయి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి చాలా పనిచేస్తుంది. వేడిని కలిగిస్తుంది. వీర్యవృద్ధిని, లైంగిక శక్తిని పెంచుతుంద

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (12:22 IST)
పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి రెండింటినీ ఆహార పదార్థాలలో వాడుతుంటారు. కొబ్బరిని అధిక మోతాదులో తినరాదు. కొబ్బరి దగ్గు, నెమ్ము ఆయాసాలను కలిగిస్తాయి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి చాలా పనిచేస్తుంది. వేడిని కలిగిస్తుంది. వీర్యవృద్ధిని, లైంగిక శక్తిని పెంచుతుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. తేలికగా అరుగుతుంది. శుక్రవృద్ధిని చేస్తుంది కొంచెం మలబద్థకాన్ని కలిగిస్తుంది.
 
కొబ్బరి కల్లు చిక్కగా రుచిగా ఉంటుంది. ఆకలిని పుట్టించి చలువ చేస్తుంది. మేహశాంతిని కలిగిస్తుంది. వీర్యపుష్టిని బలమును చేకూరుస్తుంది. మలబద్దకాన్ని అతిసార రోగమును పోగొట్టును. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు వారమునకు 2-3 దినములు 3 ఔన్సుల కల్లును త్రాగించిన పుట్టబోవు పిల్లలు ఎర్రగా, తెల్లగా పుట్టెదరు. వేడి శరీరం గల వారికి నరములకు బలము నిచ్చును. మూత్ర సంచిలోని వాతమును నొప్పిని తగ్గించును. కాక పెట్టడం, బొడ్డు సెగ చేయుట మొదలగు వానిని తగ్గించును.
 
లేత కొబ్బరి కాయలోని నీరు, వాంతిని పోగొట్టును. పైత్యమును తగ్గించును. విరేచనమును చేయును. క్రిములను చంపును, ముదిరిన కొబ్బరికాయ నీరు దగ్గును, కళ్ళెను పెంచును. లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజూ చిన్నపిల్లలకు తినిపిస్తుంటే మంచి బలమైన ఆహార పదార్థముగా పనిచేస్తుంది. 
 
కొబ్బరిపాలు, బొప్పాయి పాలు, కొంచెం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక స్పూను తింటుంటే దగ్గు, విరేచనములు తగ్గుతాయి. ఉదయం పూట ఒక గ్లాసు కొబ్బరి పాలు త్రాగి తదుపరి నాలుగు గంట లాగి ఒక చెంచా ఆముదం త్రాగితే కడుపులో నున్న బద్దెపురుగులు పడిపోతాయి. ఎండు కొబ్బరిలో కొంచెం పంచదార కలిపి తింటుంటే ప్రేగులలోనున్న కురుపులు మానిపోతాయి. మీగడలాంటి లేత కొబ్బరిని ప్రతిరోజూ ముఖంపైన వేసి రుద్దుతుంటే మొటిమలు తగ్గి ముఖం నునుపు దేలుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం