Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్కతో దీర్ఘకాలిక చర్మవ్యాధులకు చెక్

Webdunia
గురువారం, 2 జులై 2015 (19:20 IST)
మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే "దాల్చిన చెక్క" మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
 
* కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు.
 
* దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.
 
* పది గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడేవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్ వేడి నీటిలో రెండు గంటలపాటు ఉంచి ఆపై దాన్ని వడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు. మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments