Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

సిహెచ్
శనివారం, 21 సెప్టెంబరు 2024 (21:50 IST)
మీరు సరిగా నిద్రపట్టక మంచం మీద దొర్లుతూ, తిరుగుతున్నారా? ఎంతో నిద్రను పొందలేకపోతున్నారా? ఈ విషయంలో మీరు ఒంటరిగా లేరు-  ప్రపంచంలో అత్యంత నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత దేశం రెండో స్థానంలో ఉంది. 93% మంది భారతీయులు నిద్ర లేమితో బాధపడుతున్నారని ఒక సర్వే సూచిస్తోంది. చాలా మందికి, ఇది వారి నిద్రకు భంగం కలిగించే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వారి గొంతు లేదా ఛాతీలో మంటగా ఉంటుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) లేదా క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్, వరుసగా దాదాపు 8% మరియు 30% భారతీయులను ప్రభావితం చేస్తున్నాయి. ఇది అవాంతరాలు ఉండే లేదా తక్కువ నాణ్యత గల నిద్రకు దారితీస్తుంది.
 
అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ జెజో కరణ్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఎసిడిటీ అనేది నిద్ర నాణ్యతతో సహా వ్యక్తి దైనందిన జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తక్కువ నిద్ర కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా అలసట, చిరాకు తెప్పిస్తుంది. ఏకాగ్రతలో ఇబ్బందిని కలిగిస్తుంది. అబాట్‌లో మా దృష్టి అంతా కూడా పరిష్కారాలను అందించడం, వారి ఎసిడిటీని మెరుగ్గా నిర్వ హించడంలో వారికి సహాయపడటానికి ప్రజలకు అవగాహన కల్పించడం పైనే ఉంటుంది” అని అన్నారు.
 
హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌  కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ నితేష్ ప్రతాప్ మాట్లాడుతూ, “జీఈఆర్డీ అనేది భారతీయులలో ఒక సాధారణ ఫిర్యాదు. ప్రతీ నెలలో నా వద్దకు రోగులలో చాలామంది వారు తమ నిద్రను ప్రభావితం చేసే గుండెల్లో మంట వంటి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సంబంధిత లక్షణాలను తెలియజేస్తారు. ట్రిగ్గర్ ఆహారాలను నివారించడం, జీవనశైలిలో మార్పులు చేయడం, ఒత్తిడిని మేనేజ్ చేయడం, తక్షణ ఉపశమనం కోసం యాంటాసిడ్‌లు లేదా వైద్యుడు సిఫార్సు చేసిన మందులు వాడడం వంటి క్రియాశీల చర్యల కలయికతో దీన్ని వెంటనే పరిష్కరించడం చాలా ముఖ్యం.
 
సిరప్‌లు, చప్పరించే టాబ్లెట్‌లతో సహా యాంటాసిడ్స్ వివిధ రుచులు, ఫార్మాట్‌లలో లభిస్తాయి. నొప్పి తగ్గించే ఉపశమనాన్ని అందిస్తాయి. ఇవి మీ గ్యాస్ట్రిక్ ఆమ్ల లక్షణాలను తగ్గిస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పటికీ చక్కగా నిద్రపోయేందుకు కొన్ని మార్గాలు:
 
1. నిద్రించే పొజిషన్‌ను మెరుగుపరచడం
గుండెల్లో మంటను తగ్గించడానికి, మీరు నిద్రించే విధానం కూడా ముఖ్యమైనది. మీ తల లేదా పైభాగాన్ని అదనపు దిండుతో పైకి లేపడం, మీ ఎడమ వైపున పడుకోవడం కూడా ఇందుకు సహాయపడుతుంది. మీ వెనుకభాగాన్ని కిందికి ఉంచి నిద్రించడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తుందని గమనించండి.
 
2 మంచి నిద్ర పట్టేలా నిర్వహణ
నిద్ర లేకపోవడం అనేది ముఖ్యంగా క్రమం తప్పకుండా జరుగుతున్నప్పుడు అది మీ ఎసిడిటీ స్థాయిలను కూడా పెంచుతుంది. ఒకే తరహా నిద్ర షెడ్యూల్‌ను కలిగి ఉండటం ముఖ్యం. రోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కోవడం పాటించాలి. ఇది మీ శరీరం అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, మెరుగైన నిద్ర నాణ్యతను ప్రోత్సహిస్తుంది. అలాగే, విశ్రాంతి తీసుకోవడానికి, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. రిలాక్సేషన్ టెక్నిక్‌లను చదవండి లేదా సాధన చేయండి (ధ్యానం వంటివి), స్నానం చేయండి, గదిని మీకు వీలైనంత చీకటిగా, చల్లగా ఉంచండి.
 
3.    మీ ఆహారాన్ని గమనించండి  
నిద్రించే సమయానికి ముందు మసాలా లేదా భారీ భోజనాన్ని నివారించండి. జీర్ణక్రియ సరిగా ఉండేలా చూసేందుకు, మీ యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి నిద్రవేళకు కనీసం మూడు గంటల ముందు మీ రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి. వాస్తవానికి, రోజులో తరచుగా తక్కువ పరిమాణాల్లో భోజనం చేయడం మెరుగ్గా పనిచేస్తుంది. చాక్లెట్, పుల్లటి పండ్లు, టమాటాలు వంటి అసిడిటీని ప్రేరేపించే పదార్థాలను తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే, ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి, ముఖ్యంగా నిద్రించే సమయానికి ముందుగా. 
 
4. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం
ఒత్తిడి ఎసిడిటీని ప్రేరేపిస్తుంది. సడలింపు పద్ధతులు, క్రమబద్ధమైన వ్యాయామం, మీ మానసిక క్షేమానికి తోడ్పడే కార్యకలాపాలతో మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. నిత్యం చేసే శారీరక శ్రమ మీకు మేలు చేస్తుంది, కానీ నిద్రించండానికి ముందుగా ఎక్కువగా వ్యాయామం చేయడాన్ని కూడా నివారించండి. మీ మనస్సు చాలా చురుకుగా ఉండకూడదని కోరుకోండి; ఆలోచనలు నిద్రకు భంగం కలిగిస్తాయి. 
 
5. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి
మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా నిరంతర గ్యాస్ట్రిక్ ఎసిడిటీతో పోరాడుతున్నట్లయితే, వ్యక్తిగతీకరిం చిన మార్గదర్శకత్వం, చికిత్స ఎంపికల కోసం వైద్యుడిని సంప్రదించండి. వారు ఉపయోగకరమైన జీవనశైలి మార్పులు లేదా మందులను సిఫారసు చేయవచ్చు, తద్వారా మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపర్చు కునేందుకు వీలుగా మీ ఎసిడిటీని మేనేజ్ చేయవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం, మీ అసిడిటీ ట్రిగ్గర్‌లను పరిష్కరించడం వలన మీరు ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించడానికి ఒక అడుగు దగ్గరగా వెళ్తారు. ప్రశాంతమైన నిద్రతో మీరు రిఫ్రెష్‌ కావచ్చు, రోజంతా కష్టించే పని చేసేందుకు సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

తర్వాతి కథనం
Show comments