Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ కంటే వెల్లుల్లి మేలు ఘనం

Webdunia
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేది మనందరికీ తెలిసిన పాత సామెత. వెల్లుల్లి చేసే మేలు ఉల్లి కూడా చేయలేదనేది కొత్త సామెతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, వెల్లుల్లి ఔషధ గుణాలపై పరిశోధనలు చేసిన వాషింగ్టన్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు మానవ ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు ఉల్లి కూడా చేయలేదని చెబుతున్నారు.

భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన వెల్లుల్లిపాయలను సంప్రదాయ వంటకాలన్నింట్లోనూ విరివిగా వాడుతుంటారు. అయితే వెల్లుల్లిలో రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కర్బన రసాయనం అయిన అల్లిసిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటాక్సిడెంట్‌గా అల్లిసిన్ చెలామణిలో ఉంది.

వెల్లుల్లి ఔషధ గుణాలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ... శక్తివంతమైన యాంటాక్సిడెంట్ పదార్థాలను ఉత్పత్తి చేసే సహజకారకాలేవీ వెల్లుల్లిలో లేకున్నప్పటికీ... అల్లిసిన్ అంత పెద్ద మొత్తంలో ఎక్కడ నుంచి వస్తుందన్నది తమకు అంతుపట్టటం లేదని అన్నారు.

పరిశోధనల్లో భాగంగా... కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసిన అల్లిసిన్‌ను ప్రయోగశాలలో పరీక్షించిన శాస్త్రవేత్తలు.. అల్లిసిన్ రసాయన చర్య కారణంగా విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే సల్ఫేనిక్ ఆమ్లం శరీరంలోని రాడికల్స్‌పై త్వరితగతిన ప్రభావం చూపుతున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు వెల్లుల్లిలోని ఔషధ గుణాలకు, సల్ఫేనిక్ యాసిడ్ ప్రభావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లుగా వారు ఒక నిర్ధారణకు వచ్చారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments