Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేట్ దంపతుల సన్ బాత్ ఫోటోలు లీక్.. కోర్టులో విచారణ.. డయానా అందుకే చనిపోయిందా?

దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఇంగ్లండ్ యువరాజు దంపతులు విడిది చేశారు. 2012లో వీరిద్దరూ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫామ్‌ హౌస్‌లో యువరాణి కేట్ మిడిల్టన్, యువరాజుతో వ్యక్తిగతంగా సన్ బాత్

Webdunia
బుధవారం, 3 మే 2017 (13:58 IST)
దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఇంగ్లండ్ యువరాజు దంపతులు విడిది చేశారు. 2012లో వీరిద్దరూ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫామ్‌ హౌస్‌లో  యువరాణి కేట్ మిడిల్టన్, యువరాజుతో వ్యక్తిగతంగా సన్ బాత్ చేశారు. వీరిద్దరి సన్ బాత్‌కు సంబంధించిన ఫోటోలను ఫ్రెంచ్ గాసిప్ మ్యాగజైన్, పేపర్ క్లోజర్‌లో 2012 సెప్టెంబర్ సంచికల్లో ప్రచురించారు. 
 
దీంతో తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఫోటోలు ప్రచురించిన మ్యాగజైన్ నష్టపరిహారంగా 1.5 మిలియన్ యూరోలను చెల్లించాసని రాజదంపతులు ఫ్రెంచ్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా క్లోజర్ మ్యాగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, సీనియర్, ఫోటో జర్నలిస్టులతో పాటు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టులు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అయినా న్యాయస్థానం వారి వివరణపై ఏకీభవించలేదని సమాచారం. 
 
1997లో ప్రిన్సెస్ డయానాను జర్నలిస్టులు వెంటాడడం వల్లే ఆమె మృతి చెందిందని ప్రిన్స్ విలియమ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పటి నుంచి మీడియాకు రాజ కుటుంబం దూరంగా ఉంటూ వస్తోంది. అయితే 2012 సెప్టెంబర్ సంచికలో కేట్ యువరాజుతో కలిసివుండిన ఫోటోలు బహిర్గతం కావడంపై రాజ కుటుంబం సీరియస్‌గా తీసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments