అంత‌రిక్షంలో `ఛాలెంజ్‌`ను నిర్మిస్తున్న ర‌ష్యా

Webdunia
మంగళవారం, 18 మే 2021 (15:01 IST)
Yulia Peresild
అంత‌రిక్షంలోనే ఏకంగా షూటింగ్ చేస్తున్న ఏకైక సినిమాగా ర‌ష్య ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్‌లో దీనికి సంబంధించిన ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. ఒక న‌టి, ద‌ర్శ‌కుడిని స్పేస్‌కు పంపేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. 35 ఏళ్ల యులియా పెరెసిల్డ్ ఈ చిత్రంలో నటించనున్నట్లు ర‌ష్య‌న్ వార్తా సంస్థ రియా నోవోస్టి గురువారం తెలిపింది. ఇది పూర్తిగా అంతరిక్షంలో చిత్రీకరించబడుతుంది 37 ఏళ్ల క్లిమ్ షిపెంకో దర్శకత్వం వ‌హించ‌నున్నారు. పెరెసిల్డ్ అనేక రష్యన్ సినిమాలు, టీవీ సిరీస్‌లలో ఆమె న‌టించింది. ద‌ర్శ‌కుడు షిపెంకో 2020 చిత్రం "సెర్ఫ్" రష్యాలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటి.
 
స్పేస్‌కు వెళ్ళేందుకు చిత్ర టీమ్‌కు శిక్ష‌ణ కూడా ప‌రిశోధ‌న సంస్థ ఇస్తోంది. ర‌ష్య‌న్ భాష‌లో `వైజోవ్‌` పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు ఆంగ్ల‌భాష‌లో `ది ఛాలెంజ్‌` అనే పేరు పెట్టారు. క‌థ‌గా చెప్పాలంటే ఒక స‌ర్జ‌న్ అంత‌రిక్షంలోకి వెళ‌తాడు. త‌న ప‌రిశోధ‌న అన‌త‌రం తిరిగి భూమికి వ‌చ్చే క్ర‌మంలో అనారోగ్య బారిన ప‌డ‌తాడు.కాస్మోనాట్ మీద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే అతని వైద్య పరిస్థితి అతన్ని చికిత్స కోసం భూమికి తిరిగి రాకుండా చేస్తుంది. దేశ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ గ‌త నవంబర్‌లో దరఖాస్తుదారుల కోసం ఒక పోటీని ప్రారంభించిన తరువాత రష్యాలో సుపరిచితమైన పెరెసిల్డ్, షిపెంకోలను ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments