Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఘోస్ట్‌బస్టర్స్' సీక్వెల్‌గా 'ఘోస్ట్‌బస్టర్ : ఆఫ్టర్ లైఫ్' - 19న రిలీజ్

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:55 IST)
ఇవాన్ రీట్మాన్ దర్శకత్వంలో గత 1984లో వచ్చిన 'ఘోస్ట్‌బస్టర్'కు సీక్వెల్‌గో 'ఘోస్ట్‌బస్టర్ ఆఫ్టర్ లైఫ్' పేరుతో మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి ఇవాన్ రీట్మాన్ తనయుడు జాసన్ రీట్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ ఫ్రాంచైజీలో తొలిసారి గత 1984లో తొలి చిత్రం వచ్చింది. ఆ తర్వాత 1989, 2016లో మరో రెండు చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి ప్రేక్షకాదారణ పొందాయి.
 
ఇపుడు ఇవాన్ రీట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్న జాసన్ రీట్మాన్ పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇందులో పాల్ రుడ్, బిల్ ముర్రే, నాగన్ కిమ్ తదితర తారాగణం నటించగా, జాసన్ రీట్మాన్, గిన్ కెనన్‌లు కథను సమకూర్చారు. అలాగే, ఎరిక్ స్టీల్‌బర్గ్ కెమెరామెన్‌గా పని చేసిన  ఈ చిత్రానికి రామ్ సైమన్సన్ సంగీతం సమకూర్చారు.
 
ఈ చిత్రం గురించి దర్శకుడు జాసన్ రీట్మాన్ మాట్లాడుతూ, ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను 30 యేళ్ళ క్రితమే సమకూర్చుకోగా ఇప్పటికీ ఇది కార్యరూపం దాల్చిందన్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తాను ఈ మూవీని కూడా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా, 1984లో వచ్చిన ఒక చిత్రానికి ఇపుడు సీక్వెల్ తీయడం అంటే ఎంతో సవాల్‌తో కూడుకున్న పని అని, అయినప్పటికీ ప్రేక్షకులను మంత్రమగ్ధులను చేసేలా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments