Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నాల్డ్‌కు చుక్కలు చూపించిన ఏనుగు.. హాలీవుడ్ హీరోకు ప్యాంటు తడిసిందా?! (వీడియో)

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (16:27 IST)
వెండితెరపైన హీరోలు భారీ కండలు పెంచుకుని ఎవ్వరూ చేయని సాహసాలు చేస్తూ అందరిని అబ్బురపరుస్తుంటారు. కాని ఆ సాహసాలు నిజజీవితంలో చేస్తారన్న గ్యారంటీ లేదు. ఒక్కోసారి నిజ జీవితంలోకి వచ్చే సాహసాలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారు కదూ... అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
 
హాలీవుడ్ సినిమాలలో ఎన్నోసాహసాలను చేసి అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటూ అసాధ్యమైన విజయాలను సాధించిన హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్‌కి నిజ జీవితంలో మాత్రం ఓ ఏనుగు చుక్కలు చూపించింది. ఇటీవల ఆర్నాల్డ్ తన మిత్రులతో కలిసి ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళాడు.

అక్కడ ఓ భారీ ఏనుగు పెద్ద తొండంతో జీపు ముందుకొచ్చి నిలబడడంతో ఆర్నాల్డ్‌కి నోటమాట రాలేదంట. ఎక్కడ వారి మీదికి దాడిచేస్తుందోనని జీప్‌ని కొంచెం సేపు ఆపేశారు. అయితే కొద్ది నిమిషాల పాటు ఆ ఏనుగు కారు చుట్టూ తిరుగుతూ తొండాన్ని కారుపై మోపి లోపల ఉన్న వాళ్ళని తదేకంగా చూసిందట. దీంతో ఆర్నాల్డ్‌తో సహా తోటి స్నేహితులకి భయంతో వణుకుపుట్టిందట. 
 
అయితే ఆ ఏనుగు కొద్దిగా పక్కకు వెళ్ళడంతో బతుకు జీవుడా... అంటూ జీప్ స్పీడ్ పెంచి ప్రాణాలను కాపాడుకున్నారు. కాని ఆ ఏనుగు మాత్రం కొద్ది దూరం వెళ్లినట్టు వెళ్లి మళ్లీ వారిని వెంబడించి హాలీవుడ్ రేంజ్‌లో వారిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే వీరు అక్కడనుండి జారుకున్నారు.

అయితే ఈ తతంగాన్నంతా వారు వీడియోగా తీశారు. ఈ వీడియో చూసినవారంతా ఆర్నాల్డ్‌కు ఆ ఏనుగు బాగానే సినిమా చూపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. అంతేకాదు.. అయ్యగారి ప్యాంటు కూడా తడిసే వుంటుందని జోకులేసుకుంటున్నారు. అదన్నమాట సంగతి.. ఆ వీడియోను మీరు కూడా చూడండి గురూ...!
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments