Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరీ సెక్సీగా ఉందని హీరోయిన్‌పై నిషేధం : ప్చ్.. ఇదేం న్యాయం.. నాకంటే బోల్డంతమంది సెక్సీగా ఉన్నారుగా?

కాంబోడియా దేశంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఓ హీరోయిన్ మరింత సెక్సీగా ఉందని పేర్కొంటూ ఆ దేశ కల్చరల్, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా, ఓ యేడాది పాటు ఆ హ

Webdunia
మంగళవారం, 2 మే 2017 (15:54 IST)
కాంబోడియా దేశంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఓ హీరోయిన్ మరింత సెక్సీగా ఉందని పేర్కొంటూ ఆ దేశ కల్చరల్, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా, ఓ యేడాది పాటు ఆ హీరోయిన్‌పై నిషేధం విధించారు. దీంతో ఆమె బోరున విలపించింది. ఈ దేశంలో తనకంటే ఎంతో మంది సెక్సీగా ఉన్నారంటూ గగ్గోలు పెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాంబోడియాకు చెందిన 24 యేళ్ళ డెన్నీ క్వాన్ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆమె నటన కంటే... అందచందాలు మరింత సెక్సీగా ఉన్నాయి. దీన్ని నిశితంగా చూసిన ఆ దేశ సాంస్కృతిక శాఖ అధికారులు ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించారు. క్వాన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. అంతేకాదు ఆమెకు కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ మినిస్ట్రీతో ఈ విషయంలో అవగాహన క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు.
 
దీనిపై డెన్నీ క్వాన్ స్పందించారు. ‘‘కాంబోడియాలో బోల్డంతమంది సెక్సీ ఆర్టిస్టులు ఉన్నారు. షూటింగ్ సమయంలో కొందరు నాకంటే బోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు’’ అని క్వాన్ పేర్కొంది. తాను ఎటువంటి దుస్తులు వేసుకోవాలనేది తన ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ఈ ముద్దుగుమ్మ దేశ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ఇకముందు మరీ అంత సెక్సీగా ఉండకుండా జాగ్రత్తపడతానని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం