Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ క్లబ్‌లో తప్పతాగి.. బిల్లు చెల్లించని హాలీవుడ్ నటి...

హాలీవుడ్‌ నటి అన్నా రీస్ తప్పతాగి బిల్లు చెల్లించలేదు. పైగా, బిల్లు చెల్లించమని అడిగినందుకు క్ల‌బ్‌లోని వస్తువులపై తమ ప్రతాపం చూపింది. దీంతో నైట్‌క్లబ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగ ప్ర

Webdunia
మంగళవారం, 23 మే 2017 (10:21 IST)
హాలీవుడ్‌ నటి అన్నా రీస్ తప్పతాగి బిల్లు చెల్లించలేదు. పైగా, బిల్లు చెల్లించమని అడిగినందుకు క్ల‌బ్‌లోని వస్తువులపై తమ ప్రతాపం చూపింది. దీంతో నైట్‌క్లబ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగ ప్రవేశం చేసి ఆమెకు తగిన గుణపాఠం చెప్పారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బ్యాంకాక్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు అన్నా రీస్ వెళ్లింది. అక్కడ పీకల్దాకా మద్యం తాగింది. బిల్లు చెల్లించాలని నైట్‌క్లబ్ సిబ్బంది అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, అక్కడి సామాన్లను విసిరికొట్టింది. బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో నైట్‌క్లబ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచీకత్తుపై ఆమెను మరుసటిరోజు విడిచిపెట్టారు. 
 
కాగా, రెండేళ్ల క్రితం ఈమె నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ పోలీసు అధికారిని ఢీకొట్టిన కేసులో అరెస్టు అయింది. తాజా ఘటనపై స్పందిస్తూ తన కుటుంబ సమస్యల వల్ల మద్యం ఎక్కువ తీసుకోవడంతో కంట్రోల్ తప్పి అలా ప్రవర్తించానని ఆమె సమాధానమిచ్చింది. 'సునామీ వారియర్', 'బ్రౌన్ షుగర్-2' సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న అన్నా రీస్ ప్రవర్తన ఆమె కెరీర్‌ని దెబ్బ తీసేలా వుందని అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments