Webdunia - Bharat's app for daily news and videos

Install App

2010లోపు నాకు పెళ్లైపోతుందోచ్..!: పారిస్ హిల్టన్

Webdunia
FILE
అమెరికా సెలబ్రిటీ పారిస్ హిల్టన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. 2010 చివరికల్లా తనకు వివాహం అయ్యే అవకాశాలు లేకపోలేదని హిల్టన్ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ డోగ్ రీన్‌హెర్డ్‌తో ఉన్న స్నేహబంధాన్ని, వివాహబంధంగా ముడివేసుకుని త్వరలో హిల్టన్ ఇల్లాలు కానుంది.

తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుక సమీపంలోనే ఉందని హిల్టన్ లైఫ్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌తో వెల్లడించింది. రీన్ హెర్డ్ తనకు మంచి స్నేహితుడని, తనను మహారాణిలా చూసుకుంటాడని హిల్టన్ సంబరపడిపోతోంది. ఇంకా తనకు పెళ్లి గంటలు వినిపిస్తున్నాయని పారిస్ ఆ మ్యాగజైన్‌తో చెప్పుకొచ్చింది.

ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా తనకు వజ్రపు ఉంగరాన్ని బహూకరించాడని, హెర్డ్‌ను వివాహం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లైఫ్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారిస్ తెలిపింది. ఇంకా తనకోసం 14 క్యారెట్ల జ్యుయెల్లరీ షాప్‌నే హెర్డ్ కొన్నాడని.. ఇంకా డోగ్ రీన్‌హెర్డ్‌ గురించి చెప్పాలంటే మాటలే రావట్లేదని హిల్టన్ హర్షం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. ఏడాది పాటు రీన్‌హెర్డ్‌తో ఘాటు ప్రేమాయణం కొనసాగించిన హిల్టన్.. త్వరలో రీన్‌హెర్డ్‌ సతీమణి కావాలని తహతహలాడుతోందని పారిస్ సన్నిహిత వర్గాల సమాచారం. దీనిని బట్టి పారిస్‌-రీన్‌హెర్డ్‌ల వివాహం ఈ సంవత్సారాంతానికి అవుతుందని హాలీవుడ్ సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments