Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ స్పెషల్‌గా జెట్లీ ‌"అంతిమ పోరాటం‌"

Webdunia
WD
హాలీవుడ్ రైజింగ్ స్టార్స్ జెట్లీ, టాన్స్ పోర్టర్ హీరో జాసన్ స్టాతమ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "అంతిమపోరాటం". యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "రోగ్ అసాసివ్" చిత్రాన్ని అద్విక ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై కె. వెంకటరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కానుంది.

ఈ చిత్ర విశేషాలను చిత్ర నిర్మాత కె. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలతో పూర్తి యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందన్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ఇష్టపడే కథానాయకులతో ఈ సినిమా తెరకెక్కనుందని నిర్మాత అన్నారు. జెట్లీ, జాసన్ స్టాతమ్‌లు ఈ చిత్రంలో ఒకరికొకరు పోటీపడి నటించారని వెల్లడించారు. వీరిద్దరి మధ్య సాగే యాంటీవార్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

తన వాళ్ళను చంపిన హంతకులను జెట్లీ వెంటాడి వెంటాడి చంపుతూ ఉంటాడు. జెట్లీని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ట్రాన్స్‌పోర్టర్ హీరో జాసస్ స్టాతమ్ నటించారు. జెట్లీ పట్టుకోవడానికి స్టాతమ్ వెంటాడే సన్నివేశాలు ఎంతో ఆసక్తి కరంగా ఉంటాయని నిర్మాత వివరించారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఈ నెల 22న రాష్ట్ర మంతటా అత్యధిక ప్రింట్లతో విడుదల చేస్తున్నామన్నారు.

అద్విక ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి నిర్మాత.. వెంకట రెడ్డి, దర్శకత్వం.. ఫిలిప్ జి. అట్‌నెల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

Show comments